ఇటీవల ప్రముఖ నటుడు శివాజీ చేసిన పలు కామెంట్స్ ఎలాంటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై జనం రెండు వర్గాలుగా విడిపోయి రెండు వెర్షన్ లతో కొందరు శివాజీ కామెంట్స్ కి మద్దతుగా ఇంకొందరు తనకి వ్యతిరేకంగా ఉన్నవారికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే శివాజీ కామెంట్స్ తర్వాత తనో ప్రెస్ మీట్ పెట్టి ఆరోజు ముగించేశారు.
కానీ తర్వాత కూడా ఈ సెగ ఆగలేదు. అనసూయ భరద్వాజ్ రోజుకి ఒక పోస్ట్ అయినా వేస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో తాజాగా నిర్మాత ఎస్ కె ఎన్ సహా మెగా బ్రదర్ నాగ బాబులు చేరారు. అయితే షాకింగ్ గా వీరి స్టేట్మెంట్ లు శివాజీకి పూర్తి వ్యతిరేకంగా ఉండడం గమనార్హం.
ఆడవారు ఎలా బట్టలు వేసుకోవాలి అనేది వారి వ్యక్తిగతం అని నాగబాబు అంటే మీకు నచ్చినట్టు మీకు ఎలా సౌకర్యంగా ఉంటే ఆ బట్టలు వేసుకోండి అని చెప్పడమే కాకుండా అదనంగా ఏ బట్టల సత్తి మాటలు వినకండి అంటూ కొంచెం ఎక్కువ డోస్ తోనే ఎస్ కె ఎన్ చెప్పడం మరింత వైరల్ గా మారింది. దీనితో ఈ కాంట్రవర్సీ మాత్రం అలా కొనసాగుతూనే వెళ్లేలా ఉందని చెప్పాలి.


