ఓటిటిలో అదరగొడుతున్న నాగ చైతన్య కంబ్యాక్!

ఓటిటిలో అదరగొడుతున్న నాగ చైతన్య కంబ్యాక్!

Published on Mar 12, 2025 11:03 PM IST

అక్కినేని యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సినిమా “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. మరి నాగ చైతన్య కెరీర్లోనే భారీ హైప్ ని బడ్జెట్ ని అందుకున్న సినిమా ఇదే కాగా దీనికి ముందు సరైన హిట్ లేనప్పటికీ నాగ చైతన్య సాలిడ్ కంబ్యాక్ ని ఈ చిత్రంతో అందుకున్నాడు.

అయితే ఈ చిత్రం ఇటీవల ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఇపుడు అక్కడ కూడా అదరగొడుతుంది. మొన్న మార్చ్ 7 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఇపుడు ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. దీనితో నాగ చైతన్య కంబ్యాక్ ఓటిటిలో కూడా అదిరింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు