ఇన్‌స్టాలో సరికొత్త ఫీట్ అందుకున్న చైతూ..!

Published on Sep 12, 2021 1:04 am IST


అక్కినేని నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీట్ అందుకున్నాడు. సోషల్ మీడియాలో చైతూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించకపోయిన ఇన్‌స్టాలో 4 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఇక ట్విట్టర్‌లో కూడా చైతూ 2.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

ఇకపోతే ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ హీరోగా నటించిన “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు అమిగోస్ వారు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :