గీత గోవిందం దర్శకుడితో నాగ చైత్యన్య

Published on Dec 14, 2019 1:24 pm IST

అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకీ మామ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మామ అల్లుళ్ళు మొదటి రోజు వసూళ్లు కూడా దుమ్ము దులిపారని తెలుస్తుంది. నాగ చైతన్య ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ మూవీ చేస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నాగ చైతన్య 19వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇటీవలే నాగ చైతన్య బర్త్ డే కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. సాదా సీదా బట్టలలో ఓ స్పోర్ట్స్ ఆడిటోరియం లో పని చేస్తున్న చైతన్య లుక్ విభిన్నంగా ఉంది.

ఐతే నేడు నాగ చైతన్య 20వ చిత్రంపై అప్డేట్వచ్చింది . దూకుడు, లెజెండ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ చైతన్య మూవీ చేస్తుండగా, దానికి సంబంధించిన అప్డేట్ నేడు ఇచ్చారు. గత ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు పరుశురాం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More