నాంది దర్శకుడితో సినిమాకి రెడీ అయిన నాగ చైతన్య?

Published on Aug 22, 2021 12:05 am IST

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన “లవ్ స్టోరీ” చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదిన రిలీజ్ కాబోతుంది. మరోపక్క విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విజయ్‌ కనకమేడలతో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

“నాంది” ద్వారా నరేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాను ఇచ్చిన విజయ్ కనకమేడల తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడని, ఈ క్రమంలోనే చైతూకి ఒక కథను కూడ వినిపించ్నట్టు తెలుస్తుంది. కథ కొత్తగా ఉండడం, సమంతకు కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే బయటకు రాలేదు.

సంబంధిత సమాచారం :