నాగ చైతన్య సినిమా టైటిల్ అదేనా ?

Published on Nov 22, 2019 10:08 pm IST

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ కథ చాలా నిజాయితీగా, నిజంలాగా ఉంటుందని ఇదివరకే నాగ చైతన్య అన్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్రను పరిచయం చేసేలా ఒక వీడియోను ఈ నెల 23న చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఇది కూడా శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ మాదిరిగానే తెలంగాణ నేపథ్యంలో ఉండనుంది. సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. ఈ ప్రాజెక్ట్ మీద చైతన్య చాలా నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :