“నాగ చైతన్య” సరికొత్త ఫొటో చూశారా?

Published on Aug 9, 2021 4:17 pm IST


టాలీవుడ్ నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా చిత్రం లో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో టైటిల్ పాత్రను పోషిస్తూ హీరో గా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎరిక్ రోత్ మరియు అతుల్ కులకర్ణి లు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరీ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం నుండి తాజాగా మరొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్న మరొక ఫోటో ఇది. తన కథలలో డిఫెరెంట్ లుక్ ను మెయిన్ టెన్ చేసే నాగ చైతన్య ఈ చిత్రం కోసం పూర్తిగా ఆర్మీ ఆఫీసర్ లా మారిపోవడం జరిగింది. ఈ చిత్రం ను ఈ ఏడాది డిసెంబర్ కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :