ఈ హిట్ డైరెక్టర్ కి చైతు కూడా హ్యాండ్ ఇచ్చినట్లే !

ఈ హిట్ డైరెక్టర్ కి చైతు కూడా హ్యాండ్ ఇచ్చినట్లే !

Published on May 1, 2019 2:00 AM IST

“ఆర్ఎక్స్ 100” లాంటి బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు అజ‌య్ భూప‌తి. తన మొదటి సినిమా అవకాశం కోసం అజయ్ ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని, రెండో సినిమా కోసం మాత్రం బాగానే కష్టపడుతున్నాడు. అయినప్పటికీ అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయి. ఎందుకో అజయ్ విషయంలో ఇలా జరగలేదు.

మొదట రామ్ తో సినిమా అనుకున్నాడు, అది క్యాన్సిల్ అయింది. ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా అనుకున్నాడు. ఆ మేరకు అజ‌య్ భూప‌తి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా ఉందని ప్రచారం జరుగుతుంది.

కానీ ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. చైతు వెంకీమామ తరువాత, మేర్లపాక గాంధీ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అలాగే ఓన్ బ్యానర్ లో రామరాజు అనే సినిమా ఉంది. మొత్తానికి చైతు, అజ‌య్ భూప‌తితో సినిమా చెయ్యనట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు