ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య!

Published on Jul 23, 2021 11:55 am IST


అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం థియేటర్ల కి ప్రత్యామ్నయంగా ఓటిటి లో సినిమాకు అలరిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే హీరో నాగ చైతన్య ఓటిటి లోకి అడుగు పెట్టేందుకు సిద్దం అవుతున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య ప్రముఖ నిర్మాత శరత్ మరార్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఒరిజినల్ ఓటిటి చిత్రం గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే శరత్ మరార్ మరియు నాగ చైతన్య ఇప్పటికే పలు స్ర్కిప్ట్స్ చూసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తానికి ఒక స్ర్కిప్ట్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రస్తుతం దర్శకుని వేటలో ఈ ఇద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటుగా థాంక్ యూ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం బంగార్రాజు షూటింగ్ తో పాటుగా ఈ ఓటిటి చిత్రం కి సంబంధించిన షూటింగ్ షురూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :