“లాల్ సింగ్ చద్దా” లో ఆర్మీ ఆఫీసర్ గా నాగ చైతన్య…అమీర్ ఖాన్ తో పిక్ వైరల్!

Published on Jul 9, 2021 6:34 pm IST

అమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ చిత్రం లో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్ర లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో నాగ చైతన్య ఈ చిత్రం తో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో అమీర్ ఖాన్ తో పాటుగా, కండల వీరుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, కరీనా కపూర్, షర్మాన్ జోషి, మొనా సింగ్, పంకజ్ త్రిపాఠి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రం లో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే నాగ చైతన్య అమీర్ ఖాన్ తో దిగిన ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే అక్కినేని నాగ చైతన్య షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :