కుటుంబాలకు దగ్గరవ్వాలనుకుంటున్న నాగ చైతన్య

Published on Dec 15, 2019 10:13 am IST

అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త ప్రయత్నాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో మాస్ ఇమేజ్ కోసం బాగానే ట్రై చేసిన అయన ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలే మంచి ఫలితాల్ని ఇవ్వడం చూసి అటువైపే అడుగులు వేస్తే బాగుంటుందని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే అలాంటి దర్శకులతోనే వరుసగా సినిమాలు లాక్ చేసుకుంటున్నారు.

ఇటీవలే ‘మజిలీ’ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఆయన తరహాలో చేసిన చిత్రమే ‘వెంకీ మామ’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇక ప్రెజెంట్ చైతూ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు. శేఖర్ కమ్ములకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. పైగా సినిమా లవ్ స్టోరీ. ఇక తాజాగా డైరెక్టర్ పరశురాంతో కొత్త చిత్రాన్ని నిన్ననే అనౌన్స్ చేశారు. ‘గీతా గోవిందం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం చేస్తున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తానికి చైతూ తన ఫ్యామిలీ హీరోలకున్న ప్రధాన బలమైన కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు మంచి ప్రయత్నాలే చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More