నాగ చైతన్య అతని వర్క్ చూసి ఇంప్రెస్ అయిపోయారా.. ఛాన్స్ ఇస్తున్నారా ?

Published on Sep 30, 2020 3:00 am IST


థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలు, వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. తెలుగులో కూడ వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ ‘లూసర్’ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందాయి. ఈ వెబ్ సిరీస్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ దీన్ని నిర్మించింది. అభిలాష్ రెడ్డి వర్క్ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అభిలాష్ రెడ్డి నాగ చైతన్యకు ఒక స్టోరీ వినిపించారని, చైతూకు కూడ కథ నచ్చిందట.

అందుకే అభిలాష్ రెడ్డికి పూర్తి బౌండ్ స్క్రిప్త్ సిద్దం చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ సెట్స్ మీదికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక సమాచారం వెలుచడాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తైంది. చైతూ జాబితాలో వెంకీ అట్లూరి, మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి లాంటి దర్శకులు ఉన్నారు. కాబట్టి చైతూ నెక్స్ట్ సినిమా ఏంటి, ఆయన సినిమాల లైనప్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More