నాగర్జున సినిమాలో నాగ చైతన్య

Published on Dec 12, 2019 7:43 pm IST

అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు. కానీ స్క్రిప్ట్ సరిగా కుదరక ఇన్నాళ్లు సినిమా వాయిదాపడుతూ వచ్చింది.

ప్రస్తుతం కథకు సంభందించిన పనులే జరుగుతున్నాయి. స్క్రిప్ట్ లాక్ అవ్వగానే ఆలస్యం లేకుండా సినిమా సెట్స్ మీదికి వెళుతుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు, హీరో నాగ చైతన్య కూడా నటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ‘వెంకీ మామ’ ప్రమోషన్లలో చైతూ స్వయంగా చెప్పడం జరిగింది. అంటే అన్నీ కుదిరితే నాగ్, చైతూల నుండి మల్టీస్టారర్ చిత్రాన్ని ఆశించవచ్చన్నమాట. ఇకపోతే వెంకీతో కలిసి చైతన్య నటించిన ‘వెంకీ మామ’ చిత్రం రేపు 13వ తేదీన విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More