బాబీతో సినిమా చేసే ఆలోచనలో ఉన్న నాగ చైతన్య !
Published on Mar 14, 2018 10:31 pm IST

ఎస్.ఆర్.టి సంస్థ ప్రస్తుతం రవితేజతో ‘నేల టికెట్’ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది రోజున విడుదల కానుంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పూర్తయ్యాక నాగ చైతన్యతో ఈ బ్యానర్ సినిమా ప్లాన్ చేస్తోంది. ఇటీవలే ‘జై లవకుశ’తో హిట్ అందుకున్న బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇటీవలే బాబి చైతుని కలిసి కథ చెప్పడం జరిగిందని తెలుస్తోంది. చైతు ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమాతోపాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ‘నిన్ను కోరి’ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమాతో పాటు బాబి సినిమాను కూడ ఒకేసారి చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా యొక్క అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో రానుందని సమాచారం.

 
Like us on Facebook