నాగ చైతన్య సరసన మలయాళ బ్యూటీ

naga-chaithanaya-Manjima

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఏమాయ చేసావే’. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ ప్రస్తుతం నాగ చైతన్యతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ని చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కోసం గౌతమ్ మీనన్ మలయాళ బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేసారు.

మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్న మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన జోడీ కట్టనుంది. తమిళ వెర్షన్ లో కూడా తనే హీరోయిన్ గా నటిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మళయాళ ఇండస్ట్రీకి వచ్చిన మంజిమ మోహన్ ప్రస్తుతం హీరోయిన్ గా మారి స్టార్స్ తో సినిమాలు చేస్తోంది. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద’ అనే టైటిల్ ని పెట్టిన డైరెక్టర్ గౌతమ్ మీనా తెలుగులో ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version