శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నాగ చైతన్య సినిమా !

6th, February 2018 - 09:36:39 AM

‘రారండోయ్ వేడుక చూద్దాం, యుద్ధం శరణం’ వంటి సినిమాలతో మెప్పించిన అక్కినేని హీరో నాగ చైతన్య వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమా చేస్తున్న ఆయన దానితో పాటే మారుతి డైరెక్షన్లో మరొక చిత్రాన్ని కూడా ఇటీవలే మొదలుపెట్టారు.

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. డైరెక్టర్ మారుతి నాగ చైతన్యపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో చైతూకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.