శైలజారెడ్డి అల్లుడు అందరిని నవ్విస్తాడు – నాగ చైతన్య !

Published on Sep 2, 2018 11:08 am IST

యువ సామ్రాట్ నాగచైతన్య చాలా రోజుల తరువాత ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాచారం గ్రామంలోని పచ్చటి పొలాలమధ్య జరుగుతుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను బెటర్ మెంట్స్ కోసం మళ్లీ చిత్రీకరణిస్తున్నారు.

ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చైతు ఈ సినిమాకు గురించి స్పందిస్తూ ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ పాత్ర దొరకలేదు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో కొంచం ఛాన్స్ దొరికింది. మారుతీ గారు ఆ సినిమా చూసి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ పాత్రను రాసుకొచ్చారు. నా బాడీ లాంగ్వేజ్ ని ఈచిత్రంలో కొత్తగా చూపించనున్నాడు. సినిమా అందరికి నవ్వు తెప్పిస్తుందని ఈ సంధర్బంగా ఆయన అన్నారు.

ఇక ఈచిత్రం వినాయకచవితి రోజు సెప్టెంబర్ 13న ప్రేక్షకులముందుకు రానుంది. అదే రోజు సమంత నటించిన ‘యు టర్న్’ చిత్రం కూడా విడుదలకానుంది. మొదటిసారి భార్యాభర్తలు ఇద్దరు బాక్సాఫిస్ వద్ద పోటీ పడనున్నారు .

సంబంధిత సమాచారం :