
‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్ కాంబినేషన్ అయిన నాగ చైతన్య, గౌతమ్ మీనన్‌లు కలిసి తాజాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్లో శింబు హీరోగా నటిస్తుండగా, మంజిమా మోహన్ రెండు వర్షన్స్లోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
ఏ.ఆర్.రెహమాన్ అందించిన ఒక రాక్ సాంగ్‌కు నాగచైతన్య స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా టీజర్లో నాగ చైతన్య డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, ఫ్లేవర్ అంతా ఏ మాయ చేశావేను పోలి ఉండడంతో నాగ చైతన్య-గౌతమ్ మీనన్‌ల మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. నవంబర్ చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

