ఫ్రెష్ లుక్ తో వచ్చిన నాగశౌర్య ‘@నర్తనశాల’ !

ఫ్రెష్ లుక్ తో వచ్చిన నాగశౌర్య ‘@నర్తనశాల’ !

Published on Jul 20, 2018 6:00 PM IST

‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం తరువాత యువ హీరో నాగశౌర్య నటిస్తున్నచిత్రం ‘@నర్తనశాల’. నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క ఫ్రెష్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశార. ఇక ఆ పోస్టర్ లో నాగచైతన్య నవ్వుతూ గాల్లో డాన్స్ చేస్తూ కనబడుతున్నాడు. ఫస్ట్ లుక్ యొక్క కలర్ థీమ్ కూడా అక్కట్టుకునేలా ఉంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు లో ప్రేక్షకులముందుకు రానుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో యామిని భాస్కర్ , కశ్మీర ప్రదేశి కథానాయికలుగా నటిస్తున్నారు. మొదటి సినిమా ‘ఛలో’ తో సూపర్ హిట్ కొట్టిన చిత్ర నిర్మాణ సంస్థ ఐర క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య మదర్ ఉషా ములుపురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ‘ఛలో’ చిత్రం లాగానే ఈ చిత్రానికి కూడా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు