నాగశౌర్య,అనీష్ కృష్ణ ల ప్రాజెక్ట్ కూడా స్టార్ అయ్యింది.!

Published on Jul 13, 2021 1:37 pm IST

మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమ నెమ్మదిగా తాత్కాలికంగా ఆపుకున్న సినిమాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా రీస్టార్ట్ చేసుకుంటుంది. గత వారం రోజుల వ్యవధిలోనే ఆల్ మోస్ట్ స్టార్ హీరోల అన్ని సినిమాలు కూడా స్టార్ట్ కాగా యువ హీరోల సినిమాలు కూడా రీస్టార్ట్ అవుతున్నాయి. మరి అలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య కూడా తన చిత్రం “లక్ష్య” లాస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసేసాడు. మరి ఈరోజు తన కొత్త ప్రాజెక్ట్ దర్శకుడు అనీష్ కృష్ణ తో అనౌన్స్ చేసిన సినిమాను రీస్టార్ట్ చేసాడు.

షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఒక మంచి రోమ్ కామ్ ఎంటర్టైనర్ గా మంచి బజ్ తో ఆరంభం అయిన ఈ చిత్రం మళ్ళీ ఈరోజు షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నట్టుగా ఒక ప్లెజెంట్ ఫొటోతో నాగశౌర్య షేర్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో నటిస్తుండగా మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :