ఇంటర్వ్యూ : నాగ‌శౌర్య – అందుకే ‘అశ్వ‌థ్థామ‌’ అని ట్యాటూ వేసుకున్నాను.

Published on Jan 28, 2020 12:20 pm IST

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందించిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`. కాగా ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. కాగా ఈ సందర్భంగా నాగ‌శౌర్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

మీ కెరీర్ లో `అశ్వ‌థ్థామ‌` లాంటి ఎమోషనల్ ఫిల్మ్ చెయ్యలేదు. ఫస్ట్ టైం ఇలాంటి సినిమాతో రాబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ?

అవునండి. నా కెరీర్ లో మొదటిసారి ఈ స్థాయి సీరియస్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ చేయలేదు సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాత్యాలకు సంబంధించిన సినిమా కాబట్టి చాల ఎమోషనల్ గా ఫీల్ అవుతాను. సినిమా కూడా చాల బాగా వచ్చింది. అవుట్ ఫుట్ పట్ల మేము చాల సంతృప్తిగా ఉన్నాము. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ నచ్చుతుంది.

 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా చేస్తోన్న సమయంలో చాల నేర్చుకున్నా అని చెప్పారు. ఏం నేర్చుకున్నారు ?

నేను అంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం.. నేను ఈ సినిమా రాస్తున్న టైం నుండి ఇప్పటివరకూ చాల విషయాలు నాకు అవగాహనకి వచ్చాయి. మన చుట్టూ ఉన్న పర్సన్స్ దగ్గర నుండి సినిమా బడ్జెట్ వరకూ చాల మారాయి. కొంతమంది వెళ్లిపోయారు, ఇంకొంత మంది వచ్చి కలిశారు. ఈ సినిమాకి చాల చూశాను. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేను, అందుకే సినిమా పేరును ట్యాటూగా వేసుకున్నాను.

 

మీరే కథ రాశారు. సినిమాలో మీ పాత్రను ఎలా రాశారు.. అలాగే మిగిలిన పాత్రలు ఎలా డిజైన్ చేశారు ?

ఈ సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే. ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా విలన్ రోల్ కూడా చాల పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే నా రోల్ కూడా చాల ఎమోషనల్ గా ఉంటుంది.

 

ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందర్నీ కొత్త వాళ్లనే తీసుకున్నారు. రిస్క్ అనిపించలేదా ?

మా డైరెక్టర్, మా కెమెరామెన్ దగ్గర నుండి ఈ సినిమాకి పని చేసిన అందరూ కొత్తవాళ్లే. టాలెంట్ ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వకపోతే అన్యాయం చేసినవాడ్ని అవుతాను. ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు సాయి కొర్రపాటిగారు అవసరాల శ్రీనివాస్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఛాన్స్ లు రావాలి.

 

మీరు రైటర్ గా మారారు. మీ సినిమాకి మీరే కథ రాస్తున్నారు. మరి మీ సినిమాని మీరే డైరెక్ట్ చెయ్యాలనిపించలేదా ?

డైరెక్షన్ చేద్దామనే ఆలోచన అయితే ఇప్పటివరకూ నాకు రాలేదు అండి. ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేదు. నేను సెట్ లో కూడా డైరెక్షన్ కి సంబంధించి అసలు ఇన్ వాల్వ్ అవ్వను. అయితే షూట్ కి వెళ్లకముందే ప్రతి షాట్ గురించి డిస్కస్ చేస్తాం.

 

మీకు మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. మీ జోనర్ సినిమాల్ని కాకుండా ఎందుకు కొత్త జోనర్ సినిమాల్ని ఎందుకు ట్రై చేస్తున్నారు ?

ఇప్పటికే చాల లవ్ స్టోరీస్ చేసి చేసి బోర్ కొట్టేసింది. అదే పాత ప్రేమకథలు చేయయాలనిపించట్లేదు. దానికి అంటే కూడా నా కెరీర్‌లో నేను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించాలనుకుంటున్నాను. నటుడిగా నేను ఎదగాలని చేసిన ప్రయత్నం ఇది. `అశ్వ‌థ్థామ‌`తో నన్ను నేను కొత్తగా మలుచుకున్నాను.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

నా ప్రొడక్షన్ హౌస్‌లోనే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం నేను ఒక కొత్త లవ్ స్టోరీ కూడా వ్రాస్తున్నాను. అయితే ఆ లవ్ స్టోరీతో ఒక కొత్త హీరోతో మా బ్యానర్ లో సినిమా రూపొందించాలని ఆలోచిస్తున్నాము. ప్రస్తుతానికి అయితే `అశ్వ‌థ్థామ‌` రిలీజ్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం :