`అశ్వ‌థ్థామ‌’తో నేటి అమ్మాయిల మనోగతం !

Published on Jan 28, 2020 5:44 pm IST

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న `అశ్వ‌థ్థామ‌` చిత్రం జ‌న‌వ‌రి 31న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. కాగా ముందు నుంచీ ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాడు నాగ‌శౌర్య . `అశ్వ‌థ్థామ‌’ సినిమా అమ్మాయిల పట్ల సమాజంలో జరుగుతున్న ఓ రాంగ్ ఇష్యూను చాల ఎమోషనల్ గా ఎదురుకుని న్యాయం చేసే కోణంలో సాగే సినిమా కావడంతో.. ప్రస్తుతం సమాజంలో వేధింపులకు గురవుతున్న అమ్మాయిల వాయిస్ ను వినిపించడానికి నాగ‌శౌర్య వరుసగా వీడియోలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఎపిసోడ్ 1 అంటూ ఒక వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోన్న లాస్య అనే అమ్మాయి తనకు ఎదురైన వేధింపులను తెలియజేసింది. ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌.

సంబంధిత సమాచారం :