సెకెండ్ షెడ్యూల్ పూర్తి చేసిన హీరో !

Published on Aug 9, 2019 2:46 am IST

‘ఛ‌లో’ లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో రమణ తేజ దర్శకత్వంలో వ‌స్తున్న చిత్రం ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్ లో ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ విజ‌న్ కి త‌గ్గ‌ట్టుగా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. అయితే ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ లో శౌర్య ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయినా శౌర్య మొత్తానికి ఈ షెడ్యూల్ ను పూర్తి చేశాడు.

ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహ‌రిన్ హీరోయిన్ గా మ‌రోసారి ప్రేక్ష‌కుల అలరించబోతుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌, ప్రొడ్యూస‌ర్ ఉషా ముల్పూరి,

సంబంధిత సమాచారం :