నాగ శౌర్య మళ్ళీ హోమ్ బ్యానర్ లో !

Published on May 5, 2019 10:06 am IST

ఛలో సినిమా సక్సెస్ తో యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్ గాడిలో పడ్డట్లు అనిపించింది. అయితే అదే టైం లో స్టోరీ సెలక్షన్ లో చేసిన తప్పులతో వరుసగా మూడు డిజాస్టర్ లను చవిచూశాడు. దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ఇటీవల ఓ సినిమా ను మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశాడు. ప్రస్తుతం తనకు ఊహలు గుస గుస లాడే లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో మరో సినిమా చేస్తున్నాడు. ఇక ఈసీనిమా తో పాటు శౌర్య మరో సినిమా కూడా ఓకే చెప్పాడట.

వచ్చే వారం ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమా ను తెరకెక్కించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :

More