సరి కొత్త ప్రేమ కథలో నాగసౌర్య, మాళవిక !

సరి కొత్త ప్రేమ కథలో నాగసౌర్య, మాళవిక !

Published on Apr 30, 2019 11:00 PM IST

నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘కళ్యాణ వైభోగమే’లో నాగసౌర్య – మాళవిక నాయర్ జంటగా నటించి ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అలాగే ‘నాగసౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల కూడా మంచి విజయాలు సాధించాయి.

కాగా ఇప్పుడు చేయబోతున్న ఈ చిత్రం సరి కొత్త ప్రేమ కథతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కొత్త లవ్ స్టోరీతో రిపీట్ కాబోతుంది అన్నమాట. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు ‘దాసరి ప్రొడక్షన్స్’ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు