అందుకే ‘బ్లాస్ట్’ ప్రమోషన్స్ చేయలేదు – నాగవంశీ

అందుకే ‘బ్లాస్ట్’ ప్రమోషన్స్ చేయలేదు – నాగవంశీ

Published on Jul 7, 2026 12:00 AM IST

Naga-Vamsi

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన రీసెంట్ తమిళ బ్లాక్‌బస్టర్ ‘బ్లాస్ట్’ తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలై పర్వాలేదనిపించింది. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దీనికి పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా ‘లెనిన్’ మూవీ ప్రమోషన్స్‌లో నాగవంశీ దీనిపై స్పందిస్తూ అసలు కారణాన్ని బయటపెట్టారు.

ఆ సినిమా రిలీజ్ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ అయింది. ఒకవేళ తాను ‘బ్లాస్ట్ జోన్’ను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి ఉంటే.. తాను మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడని అందరూ అనేవాళ్లు, అందుకే కావాలనే వెనక్కి తగ్గినట్లు నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ గట్టిగా ప్రమోట్ చేసి ఉంటే ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద మరింత బెటర్ కలెక్షన్స్ రాబట్టేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తాజా వార్తలు