చిరు పొలిటికల్ రీఎంట్రీపై నాగబాబు కామెంట్స్ వైరల్.!

Published on Jun 3, 2022 11:06 am IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ సినిమాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే చిరు సినిమా మరియు పొలిటికల్ లైఫ్ కోసం తెలుగు ప్రజలలో తెలియనిది కాదు. అయితే చిరు మళ్ళీ సినిమాల్లోకి వచ్చి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కానీ చిరు చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి సినిమాలు అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు మళ్ళీ పలు సమీకరణాలు మారుతుండగా మెగా బ్రదర్ నాగబాబు మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ పై ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు వైరల్ గా మారింది. చిరు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లడం కానీ రాజకీయాల్లోకి రావడం అనేది జరగదు అని ఆయన సినిమాల్లోనే ఉండాలి అనుకుంటున్నారు. అక్కడే ఆయనకు మనశ్శాంతిగా ఉంటుంది ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేరు సినిమాలు మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మేము కూడా అడగమని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :