రథయాత్రతో ఎపిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన ‘నాగబంధం’

రథయాత్రతో ఎపిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన ‘నాగబంధం’

Published on Jun 13, 2026 11:00 PM IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘నాగబంధం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. భారతీయ సంస్కృతి, పురాణాల నేపథ్యంతో ముడిపడిన ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పద్మనాభస్వామి రథయాత్ర’తో చిత్ర యూనిట్ తమ గ్రాండ్ పాన్-ఇండియా ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. భారీ జనం మధ్య జరిగిన ఈ రథయాత్ర ఈవెంట్‌లో.. ఇంతటి భారీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో తనను నమ్మి అవకాశం ఇచ్చినందుకు అభిషేక్ నామాకు కృతజ్ఞతలు తెలిపాడు హీరో. దర్శకుడి విజన్‌ను స్క్రీన్‌పై ఆవిష్కరించడం కోసం గత రెండేళ్లుగా చిత్ర యూనిట్ అంతా ఎంతో నిబద్ధతతో శ్రమించామని ఆయన పేర్కొన్నాడు.

ఇక భారతీయ మూలాలు, సంస్కృతిని ప్రతిబింబించే ఒక పవర్‌ఫుల్ మైథలాజికల్ కథను ఇంత భారీ స్థాయిలో తెరకెక్కించడం తన కల అని దర్శకుడు అభిషేక్ నామా తెలిపాడు. తన విజన్‌ను నమ్మి, ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌ను కేటాయించిన నిర్మాతలు నిశిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపాడు. అనంత పద్మనాభస్వామి రథయాత్రతో ప్రారంభమైన ఈ ప్రమోషన్స్ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందిస్తాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు