ఎమోషనల్ అండ్ డిప్రెస్డ్ గా నాగచైతూ..!

ఎమోషనల్ అండ్ డిప్రెస్డ్ గా నాగచైతూ..!

Published on Nov 23, 2019 10:39 AM IST

nc19

అక్కినేని నాగార్జున నటవారసుడు నాగ చైతన్య అక్కినేని పుట్టిన రోజు నేడు. 1986 నవంబర్ 23న జన్మించిన చైతూ నేడు 33వ జన్మదినం జరుపుకోనున్నారు. 2009లో వచ్చిన జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన చైతు, ఏమాయ చేశావే చిత్రంతో మొదటి హిట్ అందుకున్నారు. సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ మూవీ చైతూకి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఈ ఏడాది మజిలి చిత్రంతో మరో హిట్ అందుకున్న చైతు ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి వెంకీ మామ చిత్రం చేస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన చేస్తున్న మరో చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.

నాగ చైతన్య 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. కాగా నాగ చైతన్య జన్మదినం పురస్కరించుకొని నేడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఓ స్పోర్ట్స్ అకాడమీలో పనిచేస్తూ, సాదా సీదా బట్టలలో చైతూ చాలా ఆర్డినరీ బాయ్ లా కనిపిస్తున్నాడు. అలాగే చైతు పాత్ర కూడా డిప్రెషన్ మరియు ఎమోషనల్ గా ఉంది. శేఖర్ కమ్ముల చైతు పాత్రను గత చిత్రాలకు భిన్నంగా రూపొందించారని అర్థం అవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు