ఎడారిలో నాగార్జున యాక్షన్ సీన్స్..!

Published on Mar 16, 2022 3:00 am IST


టాలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, అక్కినేని నాగార్జున కాంబోలో “ఘోస్ట్ ” అనే సినిమా రూపొందుతుంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా సోనాల్ చౌహన్ నటిస్తుంది. ఇటీవలల నాగ్-సోనాల్ కాంబినేషన్లోని కొన్ని సీన్స్ని దుబాయ్‌లో చిత్రీకరించగా ఆ ఫోటోలు నెట్టింట సందడి చేశాయి. అయితే తాజాగా ఈ సినిమా లొకేషన్ నుంచి మరికొన్ని ఫోటోలు బయటకొచ్చాయి.

దుబాయ్ ఎడారిలోని ఎర్రటి ఎండల్లో నాగార్జున యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇసుకలో దూసుకుని వెళ్లే బైక్ తో నాగ్ విలన్ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఛేజింగ్ సీన్స్‌ని ప్రవీణ్ సత్తారు తనదైన మార్క్‌తో చూపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన మార్క్‌కి తగ్గకుండా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :