‘బంగార్రాజు’కి సింగిల్ షెడ్యూల్ చాలు అట !

‘బంగార్రాజు’కి సింగిల్ షెడ్యూల్ చాలు అట !

Published on Apr 24, 2020 11:00 PM IST

నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కలయికలో ఆ సినిమానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది.

అయితే అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… క్రిస్టమస్ కి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది.

మరి నాగ్ ఈ సారి హిట్ కొడతారా చూడలి. అయితే నాగ్ గత సినిమా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన `మ‌న్మ‌థుడు 2′ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. దాంతో బంగార్రాజు పై మరింత కేర్ తీసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు