నాగార్జున, నాని వచ్చేస్తున్నారు

Published on Aug 5, 2018 3:11 pm IST

యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య కింగ్ నాగార్జున మరియు నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం దేవదాస్‌. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్‌ లోగోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో నాగార్జున, నానిల సరసన ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ రోజు ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఈ చిత్ర హీరోలు నాగార్జున, నాని తమ అభిమానులకు శుకాంక్షలు తెలిపి ‘దేవదాస్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆగస్టు 7 సాయత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా , నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More