సోగ్గాడుగా బిజీగా వున్న నాగార్జున

సోగ్గాడుగా బిజీగా వున్న నాగార్జున

Published on Dec 14, 2014 9:47 AM IST

nagarjuna

కళ్యాణ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో నాగార్జున ఒక ప్రాజెక్ట్ చేయనున్నట్లు 123తెలుగు ముందుగానే తెలిపింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శరవేగంగా సాగుతుంది. రామోజీ ఫిలింసిటీలో నాగార్జున మరియు బ్రహ్మానందం నడుమ కామెడీ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

నాగార్జున ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాటి(అందాల రాక్షసి ఫేం)లు హీరోయిన్స్. రాధామోహన్ కధను అందించారు. సోగ్గాడే చిన్ని నాయన అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది

తాజా వార్తలు