‘మనం’ సినిమా క్లైమాక్స్ లో ఒక్క నిమిషం కనిపించి తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అఖిల్ అక్కినేని సోలో హీరోగా చేస్తున్న మొట్టమొదటి సినిమా ‘అఖిల్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అఖిల్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని మాత్రం గత కొద్ది రోజులుగా షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో అఖిల్ తో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు కూడా కనిపిస్తారని ఇది వరకే తెలిపాము.
తాజా సమాచారం ప్రకారం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సెట్ షూటింగ్ లో నాగార్జునపై వచ్చే పార్ట్ ని షూట్ చేసారు. అఖిల్ – నాగార్జున పార్ట్ చాలా బాగా వచ్చిందని సమాచారం. ఇక ఈ సాంగ్ లో నాగ చైతన్యపై షూట్ చేసే సీన్స్ మాత్రం ఇక షూట్ చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు వివి వినాయక్ మిగిలిన్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. అలాగే అఖిల్ కి గ్రాండ్ లాంచ్ ఇవ్వడం కోసం, మొదటి సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా గ్రాండ్ ప్రమోషనల్ టూర్ ని ప్లాన్ చేస్తున్నారు.
అఖిల్ తో పాటు హీరోయిన్ గా సయేషా సైగల్ పరిచయం అవుతున్న ఈ సినిమాని నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


