‘మనం’ చానల్ లేదంటున్న నాగ్

‘మనం’ చానల్ లేదంటున్న నాగ్

Published on Apr 15, 2015 1:08 PM IST

Nagarjuna1
టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రెండు సీజన్స్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ సినిమాలపై దృష్తి పెట్టాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఆయన నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగానే నాగార్జున వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కార్తీతో చేయనున్న మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. సినిమా విషయాలను పక్కన పెడితే ఇటీవలే నాగార్జున తమ మా టీవీ చానల్ ని స్టార్ వారికి అమ్మేసిన విషయం మనకు తెలిసిందే. గత కొద్ది రోజులుగా నాగార్జున మరో కొత్త టీవీ చానల్ పెట్టనున్నారని, ఆ చానల్ కి మనం అనే పేరు పెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఈ రోజు నాగార్జున ఆ వార్తల్లో ఏం మాత్రం నిజం లేదని, అంతా వట్టి పుకార్లే అని చెప్పారు. ‘నేను మనం అనే పేరుతో ఒక ఎంటర్ టైన్మెంట్ చానల్ స్టార్ట్ చేయబోతునన్నాను అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలన్నీ నిజం కాదని’ నాగార్జున ట్వీట్ చేసాడు. దాంతో ఈ మనం టీవీ చానల్ అనే వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన సమ్మర్ చివర్లో రానుంటే, కార్తీ – నాగార్జునల సినిమా జూలై కల్లా పూర్తి కానుంది. ఈ మల్టీ స్టారర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు