Lenin : అఖిల్ సక్సెస్‌తో నాగ్ ఆనందబాష్పాలు..!

Lenin : అఖిల్ సక్సెస్‌తో నాగ్ ఆనందబాష్పాలు..!

Published on Jul 10, 2026 6:49 PM IST

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో అక్కినేని కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. లెనిన్ చిత్రానికి వస్తున్న భారీ రెస్పాన్స్ మరియు ప్రేక్షకుల ప్రశంసలతో ఎంతో ఎమోషనల్ అయిన అఖిల్, ఆనంద బాష్పాలతో తన తండ్రి ‘కింగ్’ నాగార్జునను గట్టిగా హత్తుకున్నారు.

కొడుకు సాధించిన ఈ ఘన విజయాన్ని చూసి నాగార్జున ఒక తండ్రిగా ఎంతో గర్వపడ్డారు. ఆయన కూడా ఆనందబాష్పాలతో అఖిల్‌ను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఎమోషనల్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక పక్కా రూరల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘లెనిన్’ చిత్రంలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్‌గా నటించగా థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు