ఆ కంటెస్టెంట్ పై మండిపడ్డ నాగ్… !

Published on Aug 10, 2019 4:30 pm IST

కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో సీజన్ 3 విజయవంతంగా మూడవ వారంలోకి కూడా ఎంటరైంది. ఇప్పటికే హేమా, జాఫర్ షో నుండి మొదటిరెండు వారాలలో ఎలిమినేట్ అయ్యివెళ్ళిపోగా, మరొకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి బై బై చెప్పనున్నారు. ఐతే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ఓ ఫిజికల్ టాస్క్ ఇంటి సభ్యులలో అలీ రెజా, హిమజ మధ్య వివాదానికి దారితీసింది. చివరికి ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు చేయిచేసుకొనే వరకు వెళ్లడం జరిగింది.

ఐతే విషయంలో హోస్ట్ నాగార్జున అలీ ప్రవర్తన పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదయ్యా,ఆడపిల్లతో అలానేనా ప్రవర్తించేది అంటూ అతనిపై మండిపడ్డారు. నేటి రాత్రి ప్రసారం కానున్న బిగ్ బాస్ ప్రోమోలో ఈ విషయం బహిర్గతం అయినది. మరి బిగ్ బాస్ అలీ కి ఏమైనా శిక్ష విధిస్తాడో,క్షమించి వదిలేస్తాడో,లేక ఇద్దరిని శిక్షిస్తాడో ఈ ఎపిసోడ్ లో తెలియనుంది.

సంబంధిత సమాచారం :