నాగార్జున కృషిని మెచ్చుకోవాల్సిందే

Published on Aug 22, 2019 8:38 am IST

తెలుగు సినిమాకు సంబందించిన వారసత్వ సంపదను కాపాడే దిశగా కింగ్ నాగార్జున అడుగులు వేస్తున్నారు. అందుకొరకు వియాకామ్ 18 మరియు ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ తో ఆయన చేతులు కలిపారు. ఈ మేరకు గత చిత్రాలకు సంబందించిన విలువైన వస్తువులు, అవార్డులు, పోస్టర్స్, ఫోటోలు వంటి అనేక వస్తువులను కాపాడుకొనే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

దీని కొరకు ఈ ఏడాది డిసెంబర్ 8 నుండి 15 వరకు దాదాపు వారం రోజులు ఈ అంశంపై అవగాహన కొరకు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. అలనాటి మేటి చిత్రాలకు, నటులకు చెందిన మధుర జ్ఞాపకాలను భద్రపరిచే విధంగా నాగార్జున చేపడుతున్న ఈ కార్యక్రమం అభినందించదగినదే. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వర రావు చిత్రాలు, ఆయన గెలుచుకున్న అవార్డులు, వివిధ చిత్రాలలో వాడిన వస్తువులకు సంబంధించి ఓ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :