బిగ్ బాస్ సభ్యుల ఎంపికపై నాగ్ ఆసక్తికర కామెంట్స్ .

Published on Jul 25, 2019 1:03 pm IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున మోస్ట్ సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే రెండు సిరీస్ లు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకోవడంతో మూడవ సీజన్ పై కూడా అంచనాలు భారీ స్థాయిలో లో ఉన్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు, టీవీ ఆర్టిస్టులను ఎంపిక చేశారు. వారిలో నటి హేమ,యాంకర్ శ్రీముఖి,హీరో వరుణ్ సందేశ్ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఐతే బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల ఎంపిక విషయంలో అనేక ప్రలోభాలు, సిపార్సులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. అదేమిటంటే ఈ షోకి హోస్ట్ అయినప్పటికీ నాగార్జునకు ఎంపికైన 15మంది సభ్యుల లిస్ట్ కేవలం షోకి ఐదు నిమిషాల ముందు తెలిసిందట. అంతకు ముందు అసలు ఎవరు వాస్తవంగా ఎంపికయ్యారు అనే విషయంలో ఆయనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. అప్పుడే ఇంటి సభ్యుల మధ్య వాడివేడి వాదనలతో బిగ్ బాస్ 3 హాట్ హాట్ గా సాగుతుంది.

సంబంధిత సమాచారం :