ఇంటర్వ్యూ : నాగార్జున- తొంబై శాతం హాస్యతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ .

Published on Jul 25, 2019 2:44 pm IST

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన “మన్మధుడు 2″ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు రాహుల్ రవీంద్ర రొమాన్స్,ఫన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా “మన్మధుడు 2” చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ట్రైలర్ విడుదల సందర్భంగా నాగార్జున పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ మూవీ ఎలా కార్యరూపం దాల్చిందో కొంచెం చెవుతారా?

ముందు మీకు ఓ విషయం చెప్పాలి, మన్మధుడు 2 ఓ ఫ్రెంచ్ హిట్ మూవీ రీమేక్. ఆ ఫ్రెంచ్ మూవీ నిర్మాతల నుండి హక్కులను కొనడం జరిగింది. చిలసౌ మూవీ చూసిన తరువాత రాహుల్ డైరెక్షన్ నచ్చి అతనిని ఈ మూవీ దర్శకునిగా ఎంచుకోవడం జరిగింది. రాహుల్ రవీంద్ర ఈ మూవీ కొరకు అద్భుతంగా పనిచేశారు.

 

మన్మధుడు మూవీకి ఈ చిత్రానికి ఉన్న సారూప్యత ఏమిటి?

నిజానికి మన్మధుడు సినిమాకి ఇది సెక్వెల్ కాదు, కేవలం ఆ మూవీలోని నా పాత్రని ప్రేరణగా తీసుకోవడం జరిగింది.

ఈ మూవీ నేపథ్యం గురించి చెప్పండి?

పోర్చుగల్ లో మూడుతరాల క్రితం స్థిరపడిన భారతీయ కుటుంబానికి చెందిన కథ. హీరో పెళ్లి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన సినిమా ఇది.

 

ఈ చిత్రంలో మీ వయసుపై మీరే హాస్యం పండినట్లున్నారుగా?

(నవ్వుతూ) ఈ చిత్రంలో హీరోకి, హీరోయిన్ కి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ కోణంలోనే హాస్యసన్నివేశాలు, కథ నడుస్తుంది.

 

సమంత అతిధి పాత్ర గురించి చెప్పండి?

చెప్పాలంటే ఇది డైరెక్టర్ రాహుల్ ఆలోచన. ఇందులో ఓ అతిధి పాత్ర చేయించాలని భావించిన రాహుల్ సమంతను కలిసి ఒప్పించాడు. సినిమాలో ఆమె ఎంట్రీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

 

మన్మధుడు 2 సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది?

ఆల్రెడీ నేను సినిమా చూడటం జరిగింది, దర్శకుడు రాహుల్ మూవీ ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ఎంటువంటి వోల్గారిటీకి తావులేని కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. తొంబై శాతం చిత్రం హాస్యంతో నడుస్తుంది. ప్రేక్షకులను ఆద్యతం అలరించే చక్కని చిత్రం.

 

సంబంధిత సమాచారం :