‘మన్మధుడు 2’ టీజర్: ముదురు మన్మధుడి రొమాంటిక్ యాంగిల్

Published on Jun 13, 2019 1:50 pm IST

విజయవంతమైన “మన్మధుడు” మూవీకి కొనసాగింపుగా నటుడు రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ “మన్మధుడు 2”. కింగ్ నాగార్జున సరసన రకుల్ ప్రీత్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

వయసుమీద పడినా పెళ్లికాని ముదురు బ్రహ్మచారిగా నాగార్జున పాత్రను టీజర్ లో చూపిస్తున్నారు. అమాయక బ్రహ్మచారిగా అందరి చేత అవమానాలను కామ్ గా భరిస్తున్న నటిస్తున్న మన్మధుడి మరో కోణమే “మన్మథుడు 2” మూవీ కథ అనిఅర్థం అవుతుంది. వెన్నెల కిషోర్, రావురమేష్ ల చేత పెళ్లి, శృగారం ఈ వయసులో నీకెందుకు అని అర్థం వచ్చేలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించారు.అందరూ ఏ సుఖానికి నోచుకోని బ్రహ్మచారి అనుకుంటున్న హీరో అసలు రొమాంటిక్ లైఫ్ మరోటి ఉంటుంది. సినిమాలో కింగ్ నాగార్జున రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయారనిపిస్తుంది.

మన్మధుడు మొదటి పార్ట్ లో ప్రేమించిన అమ్మాయి చేసిన మోసం కారణంగా అమ్మాయిలపై కోపం పెంచుకుంటాడు హీరో. అలాగే తాజా చిత్రంలో హీరో పెళ్లిని వదిలేసి ప్లే బాయ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరి హీరో అలా మారడం వెనుక కారణం ఏమిటో తెలియాల్సివుంది. టీజర్ చివర్లో “నేను ప్రేమలో పడను, ప్రేమను పంచుతాను ” అని అర్థం వచ్చేలా నాగార్జున చెప్పిన డైలాగ్ తో హీరో ప్లే బాయ్ క్యారెక్టర్ ని దర్శకుడు రివీల్ చేశారు . ఐతే టీజర్ లో ఎక్కడా కూడా హీరోయిన్స్ రకుల్, కీర్తి సురేష్ కనిపించలేదు. వెన్నెల కిషోర్ హీరో నాగార్జున స్నేహితుడిగా,లక్ష్మి నాగార్జున అమ్మగా నటిస్తున్నారు. ఆగస్టు 9న ఈ మూవీ విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More