నాని, నాగార్జునల సినిమా రీమేక్ కాదట !
Published on May 23, 2018 8:14 am IST

యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నాని, నాగార్జునల కానుకలో ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం హిందీలో రూపొందిన ‘జానీ గద్దర్’ అనే సినిమాకు రీమేక్ అని వార్తలొస్తున్నాయి. వీటిపై స్పందించిన శ్రీరామ్ ఆదిత్య ఇది రీమేక్ చిత్రం కాదని, ఒరిజినల్ స్క్రిప్ట్ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో కొన్ని రోజులుగా నెలకొన్న సందేహాలన్నీ తొలగిపోయాయి.

ఈ సినిమాలో రష్మిక మందన్న నానికి జోడీగా నటించనుండగా నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. గతంలో శ్రీరామ్ ఆదిత్య ‘భలే మంచి రోజు, శమంతకమణి’ లాంటి చిత్రాలతో మెప్పించి ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook