బిగ్‌బాస్ నాన్ స్టాప్ కోసం నాగార్జునకు భారీగానే రెమ్యునరేషన్?

Published on Mar 3, 2022 12:30 am IST


తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మొన్నటి వరకు బుల్లితెరపై అలరించి ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరిస్తుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ ప్రారంభమై నాలుగు రోజుల నుంచి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. అయితే రెగ్యులర్ బిగ్‌బాస్ మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన అక్కినేని నాగార్జునే ఈ ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకోసం కూడా ఆయన భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఈ ఓటీటీ సీజన్‌కి హోస్ట్‌గా చేసేందుకు నాగార్జునకు నిర్వాహకులు ఏకంగా 6 కోట్లు ఆఫర్ చేశారట. 84 రోజుల పాటు జరగనున్న ఈ ఓటీటీ షోకి మొత్తం 24 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు 25 లక్షల చొప్పున 6 కోట్ల వరకు నాగార్జునకు రెమ్యునరేషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. ఇప్పటికే 2 కోట్ల అడ్వాన్స్ కూడా నాగార్జునకు ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని సీజన్ పూర్తయ్యేలోపు ఇస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ 5 తెలుగు కోసం నాగ్ ఇంతకంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

సంబంధిత సమాచారం :