వైరల్: మేకప్ లేకుంటే నాగ్ ఇలా ఉంటాడా?

Published on Jul 7, 2021 12:46 am IST


టాలీవుడ్ మన్మథుడు ఎవరా అని అడిగితే టక్కున చెప్పే పేరు అక్కినేని నాగార్జున అని. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేసే నాగ్ గ్లామర్ విషయంలో ఇప్పటీకి ఆయనకు ఆయనే సాటీ అనిపించుకుంటుంటారు. అయితే ఇంత యంగ్‌గా ఎలా కనిపిస్తారు, దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని నాగ్‌ని చాలా మంది చాలా సందర్భాల్లో ప్రశ్నించిన దాఖలాలు లేకపోలేదు.

అయితే అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు నాగ్ పూర్తిగా మారిపోయినట్టున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో నాగ్ కనిపిస్తున్నాడు. ఇది చూశాకా మేకప్ లేకుంటే నాగార్జున ఇలా ఉంటాడా అని అందరిలో సందేహాన్ని రేకెత్తిస్తుంది.

సంబంధిత సమాచారం :