నెట్ ఫ్లిక్స్ లో దూసుకెళ్తున్న నాగార్జున ‘ది ఘోస్ట్’

నెట్ ఫ్లిక్స్ లో దూసుకెళ్తున్న నాగార్జున ‘ది ఘోస్ట్’

Published on Nov 5, 2022 2:00 AM IST


కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఇటీవల థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ థ్రిల్లింగ్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శరత్ మరార్, సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు పుస్కూర్ ఈ మూవీని సంయుక్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్రమ్ అనే రా ఏజెంట్ పాత్రలో కనిపించారు నాగార్జున. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటిటి మాధ్యమం ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఇంకా టాప్ స్థానంలో ట్రెండింగ్ అవుతూ ఉండడం విశేషం. కాగా ది ఘోస్ట్ మూవీ ప్రస్తుతం తమ ఓటిటి ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ టాప్ స్థానంలో దూసుకెళుతోందని కొద్దిసేపటి క్రితం నెట్ ఫ్లిక్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. గుల్ పనాగ్, అనిక సురేంద్రన్ కీలక రోల్స్ చేసిన ఈ మూవీకి భరత్ సౌరబ్ ద్వయం మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు