క్రేజీ బయోపిక్ ను రిలీజ్ చేయనున్న నాగార్జున !

Published on Jan 23, 2020 8:37 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.

ఇక 83 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More