నాగార్జునతో ఆ సినిమా తీసినందుకు ఫీలవుతున్న నిర్మాత

Published on Jun 13, 2019 11:12 pm IST

నాగార్జున కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఆఫీసర్’. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్ర దర్శకుడు. వర్మ గతంలో నాగార్జునతో ‘శివ, అంతం, గోవిందా గోవింద’ లాంటి సినిమాల్ని తీసి ఉండటంతో ‘ఆఫీసర్’ కూడా అదే స్థాయిలో ఉంటుందని అనుకున్నారు అందరూ. చివరికి ఆ చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర సైతం నాగ్, వర్మల కాంబోలో మ్యాజిక్ రిపీట్ అవుతుందని, దానికి తన సినిమానే వేదిక కాబోతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం అందరినీ తలకిందులు చేసింది.

సినిమా వచ్చి ఏడాది దాటినా ఇంకా ఆ చేదు అనుభవాన్ని నిర్మాత మర్చిపోలేకపోతున్నారు. తాజాగా విడుదలైన ‘మన్మథుడు 2’ సినిమా టీజర్ చూసి, అందులో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగార్జునను ప్రెజెంట్ చేసిన విధానాన్ని, ఆయన క్రేజ్‌ను చక్కగా వాడుకున్న తీరును చూసి ఈయనతో ‘ఆఫీసర్’ లాంటి సినిమా తీశాం అంటూ మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నందుకు తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :

More