హీరో నాగ శౌర్య గత ఏడాది ఛలో, కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల అని నాలుగు సినిమాలు విడుదల చేశారు. వీటిలో ఛలో ఆయనకు సూపర్ హిట్ అందించింది. ఈఏడాది సమంతకు జోడీగా ఓ బేబీ చిత్రంలో కనిపించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం మంచి హిట్ అందుకుంది. కాగా ఛలో వంటి హిట్ ఇచ్చిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నాగ శౌర్య చేస్తున్న చిత్రం అశ్వథామ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర కాన్సెప్ట్ అండ్ మోషన్ పోస్టర్ ఈనెల 29న సాయంత్రం 4:05నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.
నూతన దర్శకుడు రమణ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా బ్యూటీ మెహ్రీన్ పిర్జా మొదటిసారి నాగ శౌర్య సరసన నటిస్తుంది. అన్యాయాన్ని ప్రశ్నించే వాడిగా నాగ శౌర్య పాత్ర ఉంటుందని ప్రాధమిక సమాచారం. ఐరా క్రియేషన్ బ్యానర్ లో వస్తున్న ఈచిత్రానికి శ్రీచరణ్ పాకల మ్యూజిక్ అందిస్తున్నారు.


