తీవ్రగాయాలపాలైన టాలీవుడ్ యంగ్ హీరో

Published on Jun 15, 2019 9:03 am IST

యంగ్ హీరో నాగ శౌర్య నిన్న ఓ ప్రమాదానికి గురైయ్యారు. ఆయన నటిస్తున్న ఓ కొత్త మూవీ షూటింగ్ సందర్భంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సమంత సరసన హీరో గా నాగ శౌర్య “ఓ బేబీ” మూవీలో నటిస్తున్నారు. అలాగే ఆయన సొంత నిర్మాణ సంస్థ ఐన, ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ తేజ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి వైజాగ్ లో ఓ పోరాట సన్నివేశం చిత్రీకరణలో హీరో నాగ శౌర్య డూప్ సహాయం లేకుండా ఎత్తైన భవనం పైనుండి దూకడంతో ఆయన కాలికి బలమైన గాయమైందని సమాచారం. దీంతో ఆయనను దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకుపోగా ,అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్ దాదాపు నెల రోజుల విశ్రాంతి అవసరం అని చెప్పారంట. దీనితో ఆయన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కి ప్రయాణం ఐయ్యారు.

ఈ మధ్య టాలీవుడ్ హీరోస్ తరచుగా గాయాలపాలవుతున్నారు.రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు గాయాలపాలు కావడం జరిగింది. అలాగే హీరో గోపీచంద్ నటిస్తున్న “చాణక్య” మూవీ షూటింగ్ జరుగుతుండగా ఆయనకు గాయం కావడంతో షూటింగ్ కొన్ని రోజులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదకరమైన సన్నివేశాల చిత్రీకరణలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం తో పాటు ఈ మధ్య మన యంగ్ హీరో లు మరీ క్లిష్టమైన సన్నివేశాల కోసం మినహా దాదాపు అన్ని సన్నివేశాలు డూపులేకుండానే చేయడానికి ఆసక్తి చూపించడంతో ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ టాక్.

సంబంధిత సమాచారం :

More