యంగ్ హీరో ‘అశ్వథామ’ విడుదల తేదీ ప్రకటించేశారు..!

Published on Dec 11, 2019 12:27 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వథామ. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ నూతన కాన్సెప్ట్ తో దర్శకుడు రమణ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రమణ తేజ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగ శౌర్య ఈ మూవీ కొరకు పూర్తి మేక్ ఓవర్ అయ్యారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో నాగ శౌర్య యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీయనున్నాడు. అన్యాయాన్ని ప్రశ్నించే వాడిగా అశ్వథామ చిత్రంలో తన పాత్ర ఉంటుందని గతంలో నాగ శౌర్య చెప్పడం జరిగింది. ఇటీవలే విడుదలైన అశ్వథామ మోషన్ పోస్టర్ విశేష స్పందన దక్కించుకుంది.

కాగా నేడు ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు చిత్ర యూనిట్. వచ్చే ఏడాది జనవరి 31న మూవీ విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేశారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ములుపురి నిర్మిస్తున్నారు. మెహ్రిన్ ఫిర్జా మొదటి సారి నాగ శౌర్యకి జంటగా నటిస్తుంది. శ్రీ చరణ్ పాకల అశ్వథామ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో నాగ శౌర్య కు గాయం కావడం జరిగింది. దీనితో చిత్ర విడుదల ఆలస్యం అయ్యింది.

సంబంధిత సమాచారం :

X
More